జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రూట్ మ్యాప్ విడుదలైంది. తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించిన ర్యూమ్ మ్యాప్ విడుదల చేశారు జనసేన నేతలు. ఈ నెల 24న హైదరాబాద్ నుండి కొండగట్టుకు పవన్ వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు అక్కడికి చేరుకుని, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
అనంతరం వారాహి వాహనానికి కూడా పూజలు చేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు కొడిమ్యాల నాచుపల్లిలోని బృందావన్ రిసార్ట్ లో ముఖ్యనేతలతో సమావేశమవుతారు.
రాబోయే రోజుల్లో తెలంగాణలో పార్టీ అనుసరించే వ్యూహం, చేపట్టబోయే కార్యక్రమాలపై పవన్ దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది. అదే రోజు సాయంత్రం 4 గంటలకు ధర్మపురిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు.
ఆ తర్వాత మిగిలిన 31 నారసింహ క్షేత్రాలను పవన్ సందర్శిస్తారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు పార్టీ కార్యకర్తలతో భేటీ అవుతారని జనసేన వర్గాలు వెల్లడించాయి.