జనసేన అధినేత బీజేపీ పెద్దలతో భేటీ కాబోతున్నారా…? ఇంగ్లీష్ మీడియంపై బీజేపీ-పవన్ ఉమ్మడిగా పోరాడనున్నారా…? బీజేపీ-జనసేన మళ్లీ కలవబోతుందా…? ఇప్పుడివే వార్తలు ఏపీలో హట్ టాపిక్ అవుతున్నాయి.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లారు. ప్రైవేటు కార్యక్రమం అని జనసేన వర్గాలు చెబుతున్నప్పటికీ… రాష్ట్రంలో జరుగుతన్న పరిణామాలపై పవన్ బీజేపీ పెద్దలతో చర్చించే అవకాశం కనపడుతోంది. పవన్ కూడా రాష్ట్రంలో పరిస్థితులు, మేలు కోసం మోడీ, అమిత్‌షాలను కలుస్తానని గతంలోనే ప్రకటించారు. దాంతో ఢిల్లీ పర్యటనలో పవన్ బీజేపీ పెద్దలతో భేటీ అవుతారని చర్చ సాగుతోంది.
పవన్ ఇటీవల ప్రకటించినట్లుగానే ఇసుక కొరతతో ఇబ్బందులకు గురవుతున్న భవన నిర్మాణ కార్మికుల కోసం తమ వంతుగా డొక్కా సీతమ్మ అన్నదాన శిబిరాన్ని ప్రారంభించి, ఢిల్లీ వెళ్లారు.