జనసేన అధినేత పవన్‌కు ఢిల్లీ పిలుపొచ్చిందా…? స్థానిక ఎన్నికల్లో బీజేపీతో పవన్ కలిసి నడవబోతున్నారా…? ఓవైపు పార్టీ కీలక మీటింగ్ నడుస్తుంటే పవన్ ఢిల్లీ బాట పట్టడానికి కారణం అదేనా…?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అత్యవసరంగా ఢిల్లీ వెళ్లటం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతోండగా ఢిల్లీ పిలుపొచ్చింది. దీంతో సమావేశం నడుస్తుండగానే పవన్ ఢిల్లీ వెళ్లిపోయారు. దీంతో అంత అర్జంటుగా పవన్ ఢిల్లీ పర్యటనకు కారణమేంటన్న ప్రశ్న ఇటు జనసేన వర్గాల్లోనూ, ఏపీ పొలిటికల్ సర్కిళ్లలోనూ చర్చనీయాంశం అవుతోంది.
అయితే, అంత అత్యవసరంగా ఢిల్లీ వెళ్లాల్సిన పని పవన్‌కు ఏమీ లేదని, కేంద్రంలోని బీజేపీ పెద్దల నుండి పిలుపు వచ్చి ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే రాజధాని అంశంలో బీజేపీతో మాట్లాడతానంటూ పవన్ ప్రకటన కూడా చేశారు. కేంద్రం పెద్దన్నగా జోక్యం చేసుకోవాలని పవన్ విజ్ఞప్తి చేశారు. ఇందుకోసమే పవన్ వెళ్లారా అని ఒకవైపు చర్చ జరుగుతోంటే… మరోవైపు స్థానిక ఎన్నికల్లో పోటీకి రెడీ అయిన బీజేపీతో జనసేన కలిసి వెళ్లే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అందుకే పవన్ ఢిల్లీ వెళ్లాడని టాక్ నడుస్తోంది.
ఢిల్లీ వెళ్లిన పవన్ ఎవరిని కలుస్తారన్న అంశం తేలితే అసలు విషయం తెలిసే అవకాశం ఉంది.
చిరంజీవిపై నిర్మాత అశ్వినీదత్ ఫైర్
Advertisements
వైసీపీలోకి జనసేన ఏకైక ఎమ్మెల్యే…?