పోలవరం టెండర్లు రద్దు చేసి, అమరావతి నిర్మాణాలు నిలిపివేసి పెట్టుబడుదారుల్లో భయాందోళనలు స్పష్టించారు. దీని కారణంగా రూ.24వేల కోట్ల పెట్టుబడితో 5వేల మందికి ప్రత్యక్షంగా, 10వేలమందికి పరోక్షంగా ఉపాధి కల్పించే ఏషియన్ పల్స్ అండ్ పేపర్ మహారాష్ట్రకు తరలిపోతోంది. మచిలీపట్నం పోర్టు నిర్మాణాన్ని అనిశ్చితిలోకి నెట్టిశారు. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రులు వద్దని హెచ్చరించినా పీపీఏలను రద్దు చేశారు. ఇలాంటి నిర్ణయాల వల్ల పెట్టుబడిదారుల్లో విశ్వాసం కోల్పోతాం. జపాన్ దేశ రాయబారి కేంద్రానికి లేఖ రాశారు. కియ మోటార్స్ సీఈవోను వైసీపీ నాయకులు అవమానాలకు గురిచేశారు. జగన్ లక్ష కోట్లు దోచేశారని టీడీపీ ఆరోపిస్తోంది. ఆ లక్ష కోట్లు పెట్టుబడిగా తెస్తారా. పెట్టుబడిదారులను పంపించేసి కూడా పెట్టుబడులు వస్తాయని ధైర్యంగా ఉన్నారంటే మరో రూపంలో డబ్బులు వచ్చుండాలి. గ్రామ వలంటీర్లుగా వైసీపీ కార్యకర్తలను నియమిస్తూ సమాంతర వ్యవస్థ తయారుచేస్తున్నారు. వలంటీర్ల వ్యవస్థ కొరియర్ సర్వీసులా ఉంది. టీడీపీని జన్మభూమి కమిటీలు ఎంతలా దెబ్బతీశాయో, వైసీపీని వలంటీర్ల వ్యవస్థ అంత దెబ్బతీస్తుంది.. అని జన సేనాని జగన్ సర్కారుపై మండిపడ్డారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ 100 రోజుల పాలనపై 33 పేజీల నివేదిక తయారు చేయించారు. జనసేన పార్టీ ఏర్పాటుకు దోహదపడిన అంశాలు, వైసీపీ పాలన తీరుపై ఈ నివేదిక రూపొందించారు.
పవన్ పాయింట్స్
- ఆరోగ్యకరమైన రాజకీయం చేయాలనుంది.
- జనసేన ఓటమి పాలైనా బలంగా నిలదొక్కుకున్నాం.
- సద్విమర్శలు చేసేందుకు అధ్యయనం చేస్తాం.
- వైసిపి నిర్ణయాలు ఆక్షేపణకు గురిచేశాయి.
- పారదర్శకత, దార్శనికత లోపించిన 100 రోజుల పాలన.
- నవరత్నాలు జనరంజకం.. కానీ జన విరుద్ధంగా పాలన.
- గత ప్రభుత్వం ఇసుక మాఫియాను ప్రోత్సహించింది.
- సర్కార్ ఇసుక పాలసీ అనగానే సంతృప్తి చెందాను.
- ఇసుక లేక పార్టీ ఆఫీస్ గోడ నిర్మాణం ఆగింది.
- ఇసుక కొరత వల్ల లక్షలాదిమంది కార్మికులు పనుల్లేక ఆవేదన చెందారు.
- ఇసుక కొరత వల్ల అనుబంధ రంగాలు దెబ్బతిన్నాయి.
- 2 లక్షల 55 వేల కోట్ల అప్పులున్నాయి.
- నవరత్నాలు అమలుకు 50 వేల కోట్లు కావాలి.
- పీపీఏల సమీక్ష ద్వారా పెట్టుబడులు రాకుండా పోతున్నాయి.
- కియా మోటార్స్ ను కించపరిచారు.
- ఒప్పందాలు ప్రభుత్వాలతో కానీ పార్టీలతో కాదు.
- 151 మంది మెజారిటీ సభ్యులున్నారు, పోలీస్ తోపాటు ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి. ఏమి సాధిస్తున్నారు.
- ప్రకాశం జిల్లాలో పరిశ్రమ రాకుండా అడ్డుకున్నారు.
- మీ జేబులో డబ్బులు, మీ సిమెంట్ ఫ్యాక్టరీలు కాదు.
- సీఎం ధర్మకర్తగా వ్యవహరించాలి.
- రాష్ట్రం తీవ్రంగా నష్టపోతోంది, సహించేదిలేదు.
- వలంటరీ వ్యవస్థ కొరియర్ సిస్టం లాగా ఉంది.
- సమకాలీన పార్టీ వ్యవస్థను తయారు చేశారు.
- పెట్టుబడులు రాకపోతున్నా ధీమాగా ఉంటున్నారు.
- మీ ధైర్యం ఏమిటి? ఏదో పెట్టుబడి రహస్యం ఉంది?
- కృష్ణా జిల్లాలో 8,300 మంది జ్వరాల బారిన పడ్డారు..ఇదేనా హెల్త్ పాలసీ.
- పోలవరం ప్రాజెక్ట్ టెండర్లు రద్దు చేసి పనులు ఆపారు.
బొత్సపై సెటైర్లు…
- అభివృద్ధి భావితరాల కోసమే తప్ప బొత్స కోసం కాదు.
- రాజధాని 5 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవం.
- గెజిట్ నోటిఫికేషన్ టిడిపి సర్కారు ఇవ్వలేదు, మీరు ఇవ్వవచ్చుకదా.!
- అన్ని పార్టీల వారు రాజధానిగా గుర్తించారు, ఇప్పుడు డోలాయమమానం ఎందుకు?
- వరద నీరు నిర్వహణలో వైఫల్యం చెందారు.
- మంత్రుల తీరు బాధాకరం, హనీమూన్ లాగా ఉంది, చంద్రబాబు ఇంటి చుట్టూ తిరిగారు.
- వైజాగ్ లో నీటికి కటకట వచ్చే పరిస్థితులు ఉన్నాయి.
- రాజకీయాలు సరదాగా ఉన్నాయి.
- అసలు రాష్ట్రంపై సమగ్ర వ్యూహం ఉందా? లేదా?
- విత్తనాలు దొరక్క రైతులు చనిపోతుంటే ఏమి చేస్తున్నారు.
- రైతు కన్నీరు రాష్ట్రానికి క్షేమం కాదు, అథ:పాతాళానికి పోతారు.
- స్పందన, మానవత్వం లేకుండా వ్యవహరిస్తోంది వైసీపీ ప్రభుత్వం.
- రైట్ టు ఎడ్యుకేషన్, అమ్మ ఒడి పేరుతో 15 వేలు చిచ్చుపెడుతుంది.
- బలమైన అభివృద్ధి ఏదైనా ఉందంటే మద్యం అమ్మకాలు.
- విస్కీని ప్రోటీన్ షేక్ గా తెస్తారు, బీర్ల అమ్మకాలు 13 శాతం పెరిగాయి.
- శాంతి భద్రతలు క్షీణించాయి, కోడి కత్తి దాడిపై డిమాండ్ చేసిన వైసిపి, వివేకా హత్య కేసును ఛేదించలేదు.
- అఖిల పక్షం వేసి ఆందోళన చేపడతాము.
- డిజిపి స్పందించాలి.
- టీడీపీపై కక్ష తీరకపోతే లోకేష్ కు, చంద్రబాబుకు పడవలు ఇచ్చి సాగనంపండి.
- 100 రోజులు గడువు తీరింది, సంధించిన ప్రతి అంశానికి సమాధానం చెప్పాలి.
- క్షేత్ర స్థాయి పోరాటాలు చేస్తాం.