భూములు ఇచ్చి నష్ట పోయిన రైతులందరికీ అండగా ఉంటానని మాటిచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాజధాని మహిళలను కలిసిన పవన్ తో రెండు నెలలుగా పడుతున్న ఇబ్బందుల గురించి చెప్పుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ బిజెపి తో పొత్తు సమయంలో కూడా నేను రైతులకు న్యాయం చేయాలని అడిగానని తెలిపారు. రాజధాని ఎక్కడ ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమని ఆనాటి ప్రభుత్వం, ప్రతిపక్షం కలిపే అమరావతి ని రాజధానిగా నిర్ణయించాయని తెలిపారు. ఇప్పుడు ఇష్టం వచ్చిన విధంగా మారుస్తామంటే ఎలా కుదురుతుందని ప్రశ్నించారు. ఒక వేళ బలవంతంగా తరలించినా వెనక్కే వస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ విస్తృత అధికారంతో కేంద్రం కూడా వెంటనే స్పందించలేదని తెలిపారు. ఐదేళ్లకొకసారి రాజధాని మారుస్తామంటే మంచిది కాదని, రైతుల పేరు చెప్పి వైసిపికి అనుకూలంగా ఉన్నవారినే సిఎం వద్దకు తీసుకెళ్లారని ఆరోపించారు. వారు మూడు రాజధానులకు మద్దతు పలికారని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రాజధానికి రావాలని నడ్డా గారిని ఆహ్వానించాం. ఢిల్లీ ఎన్నికల వల్ల ఆరోజు పర్యటన వాయిదా పడింది. త్వరలో జనసేన, బిజెపి నాయకులు అమరావతి లో పర్యటిస్తారు. బిజేపి రెండోసారి రాగానే అమరావతి లో పెట్టుబడులు పెట్టేందుకు సంస్థలు లు వచ్చాయి. అయితే జగన్ ప్రభుత్వం తీరుతో వాళ్లు వెనక్కి వెళ్లిపోయారు. అమరావతి కి అండగా ఉంటామని బిజెపి జాతీయ నేతలు కూడా నాకు చెప్పారు. 90 శాతం భూములు ఇచ్చాక రాజధాని మార్చడం అన్యాయని అన్నారు. మీకు అన్యాయం జరగదు అని భరోసా ఇచ్చేందుకే నేను ఈరోజు మీ దగ్గరకు వచ్చాను. ఎవరూ అధైర్యపడవద్దు.. నేను మీకు అండగా పోరాడతాను అని హామీ ఇచ్చారు.
Tolivelugu Latest Telugu Breaking News » Top Stories » రాజధాని రైతులకు అండగా నేనున్నా.!!