ట్విట్టర్ ఫ్యాక్షనిజంపై జనసేనాని చేసిన పోరాటం ఫలించింది. ట్విట్టర్ ఇండియాకి థాంక్స్ చెబుతూ పవన్‌కల్యాణ్ చేసిన ట్వీట్ ఇదే చెబుతోంది. ‘ట్విట్టర్ ఇండియాకు మన:పూర్వక కృతజ్ఞతలు. రాజ్యాంగబద్ధమైన భావ ప్రకటన హక్కును సంరక్షించే క్రమంలో జనసేన పార్టీ ఫాలోవర్లకు చెందిన ట్విట్టర్ అకౌంట్లన్నీ పునరుద్ధరించినందుకు ధన్యవాదాలు.. ’ అంటూ పవన్‌కల్యాణ్ ట్వీట్ చేశారు.
ట్విట్టర్లో కూడా ఫాక్షనిజం ఉందా? ఫ్యాక్షనిజంతో ప్రత్యర్ధుల్ని దెబ్బతీసినట్లు ట్విట్టర్ అకౌంట్లను మూకుమ్మడి ఫిర్యాదులతో క్లోజ్ చేయిస్తున్నారా? అంటూ తొలివెలుగు ఈ వ్యవహారంపై లోగడ ఒక కథనం అందించింది. ఆ కథనం సోషల్ మీడియాలో బాగా హాట్ టాపిక్ అయ్యాయి. చిరంజీవి అభిమానులు, జనసేన కార్యకర్తలు ట్విట్టర్ ఫాక్షనిజాన్ని నిరసిస్తూ కొద్దిరోజులుగా ట్వీట్ చేయడం చర్చకు దారితీసింది.
జనసేన పార్టీ లేవనెత్తిన చట్టబద్ధమైన ప్రశ్నలకు సమాధానాలు లేనప్పుడు తాము ఏమి చేయాలని మెగాభిమాని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించడంతో అసలు మేటర్ బయటికి వచ్చింది. జనసేనకు మద్దతు ఇచ్చే ట్విట్టర్ ఖాతాలను వైసీపీ వర్గీయులు సస్పెండ్ చేయించారని మెగాభిమానులు, జనసేన కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ‘వై ఎస్ జగన్ స్టయిల్ ట్విట్టర్ ఫాక్షనిజాన్ని స్వాగతిస్తున్నామ’ని ట్విట్టర్లో సెటైర్ వేశారు.
ఏదైనా ట్విట్టర్ ఖాతాను సస్పెండ్ చేయించాలంటే మూకుమ్మడిగా ఇది సరైన అకౌంట్ కాదని వందకుపైగా ఫిర్యాదులు వెళితే అంతే సంగతులు. ఆ ఖాతా క్లోజ్. ఇలా మూకుమ్మడి ఫిర్యాదులతో జగన్ ఫాలోయర్స్ తమ అకౌంట్లను క్లోజ్ చేయించారని జనసేన అభియోగం. ‘జే ఎస్ పి వీర మహిళా’, ‘జే ఎస్ పి శతఘ్ని టీం’, ‘పొలిటికల్ సేన’, ‘ట్రెండ్ పిఎస్ పీకే’ అకౌంట్లను ట్విట్టర్ రూల్స్ అతిక్రమించినందుకు సస్పెండ్ చేసినట్లు గతంలో నోట్ వచ్చింది. దీనిపై మెగాస్టార్ ఫాలోయర్ @ చిరు ఫాలోయర్ ట్వీట్ లో ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి పవన్ కల్యాణ్ జోక్యంతో దీనికి తెరపడింది.
ఇదీ పపన్ కల్యాణ్ తాజా ట్వీట్…
Okka tweet tho 400 accounts unsuspend chepincharu…..
Only once Fasak pic.twitter.com/coWh9HBJdC
— ?ᴀʟᴇᴋʏᴀ ʀᴇᴅᴅʏ ?#withpk (@Alekya_k_) September 20, 2019
క్రింద వున్నవి జనసేన, మెగాభిమానులు గతంలో చేసిన ట్వీట్లు..