పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఫ్లెక్సీలు కడుతూ ముగ్గురు అభిమానులు చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తూ పవన్ కళ్యాణ్ ,దిల్ రాజు ,రామ్ చరణ్ అల్లు అర్జున్ , ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. కాగా తాజాగా బాధిత కుటుంబాలకు సహాయంగా జనసేన ముందుకు వచ్చింది. మొత్తం 45 లక్షల రూపాయలను చనిపోయిన కుటుంబాలకు ఆర్థిక సహాయం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 13.50 లక్షలు గాయాలైన వారు ఒక్కొక్క కుటుంబానికి 1.50 లక్షల ను ఆర్థిక సహాయం చేసింది.