మెగాస్టార్ చిరంజీవి.. సామాన్య కుటుంబం నుంచి వచ్చి.. టాలీవుడ్‌లో నెంబర్ వన్ హీరోగా ఎదిగారు. పాత్ర ఏదైనా తనకు తానే పోటీగా నటిస్తాడు. మెగాస్టార్ సినిమాల్లోకి రాకముందు ఎలా ఉండేవారు..? ఆయన లుక్ ఎలా ఉండేది..? అనేది మాత్రం ఎవరికి తెలియదు.
తాజాగా.. చిరంజీవి చిన్ననాటి మిత్రులు అప్పట్లో చిరుతో కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. నెల్లూరు నగరంలో జనసేన నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి పవనన్న ప్రజాబాట పేరిట నిత్యం ప్రజలను కలుసుకుని వారి సమస్యలు తెలుసుకుంటున్నారు.
ఇంటింటికీ వెళ్లి ప్రజలతో మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో ఓ ఇంటికి వెళ్లగా.. ఆయనకు అరుదైన ఫొటోలు కనిపించాయి. అందులో చిరంజీవి ఫోటోను చూసి షాక్ అయ్యారు. తాను వెళ్లిన ఇంటి ఓనర్ నటరాజ్ మెగాస్టార్ చిన్ననాటి స్నేహితున్ని అని చెప్పాడు. చిరంజీవి స్నేహితున్ని కలిసిన కేతంరెడ్డి వారి చిననాటి జ్ఞాపకాలను అడిగి తెలుకున్నారు.
ఈ క్రమంలో చిరంజీవితో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు నటరాజ్. చిరంజీవి అసలు పేరు ప్రసాద్ అని చెప్పాడు. చిన్నప్పుడు వారిద్దరు చాలా క్లోజ్ గా ఉండేవారని తెలిపాడు. ఒంగోలులో మేము డిగ్రీ చదివేటప్పటి ఫొటో.. అంటూ భద్రంగా దాచుకున్న ఫోటో చూపించాడు. యవ్వనంలో ఉన్న చిరంజీవి ఫోటో అందరిని ఆకట్టుకుంటోంది. ఇందుకు సంబంధించిన వీడియోను కేతంరెడ్డి వినోద్ రెడ్డి ట్వీట్టర్ లో షేర్ చేసుకున్నారు. ఇప్పుడది తెగ వైరల్ అవుతోంది.