నాదెండ్ల మనోహర్, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్
జీతాలు కూడా సక్రమంగా ఇవ్వని అసమర్ధ ప్రభుత్వం ఏపీలో ఉంది. సర్కార్ ఆస్తులు తాకట్టు పెట్టి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో వైసీపీ ఆర్థిక మోసాలకు తెరలేపింది. ఎక్కడా రోడ్లు వెయ్యలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. రూ.3 వేల కోట్లతో మత్స్యకారులకు హార్బర్ లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఎక్కడా కార్యాచరణ లేదు.
పరిమితి లేని రుణాలతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దివాలా దిశగా తీసుకెళ్తోంది జగన్ సర్కార్. సూట్ కేసు కంపెనీలు నడిపిన చందంగా ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారు. వైసీపీ మంత్రులకు తమ శాఖలపై పట్టులేదు. రాష్ట్రానికి కొత్త కంపెనీలు రావడం లేదు. ఉన్న కంపెనీలు వదిలి పోతున్నాయి. ప్రతీరోజూ రూ.830 కోట్లు ఖర్చు పెడుతున్నామని చెబుతున్నారు. మరి.. ఆ డబ్బు ఎక్కడికి పోతుంది.