రాయలసీమ బిడ్డ సుగాలి ప్రీతి కుటుంబానికి అన్యాయం జరిగిందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కర్నూల్ పర్యటనలో భాగంగా రెండవరోజు మీడియాతో మాట్లాడారు. అత్యంత కిరాతకంగా ప్రీతిని అత్యాచారం చేసి హత్య చేశారు.సంఘటన జరిగి మూడు సంవత్సరాలు గడుస్తున్నా కేసులో పురోగతి లేదని ఆరోపించారు. దిశ చట్టం తెచ్చిన రాష్ట్రంలో ప్రీతికి న్యాయం జరగకపోవడంమన మన దౌర్భాగ్యమని విమర్శించారు. పోస్టుమార్టం రిపోర్ట్ లో స్పష్టంగా అత్యాచారం జరిగిందని ఉన్నా నిందితులను అరెస్ట్ చేయడంలో పోలీసులు అలసత్వం ప్రదర్శించారని ఆరోపించారు. జరిగింది చిన్న తప్పు కాదు. హత్య, అత్యాచారం జరిగిన కేసుల్లో పోలీసుల అలసత్వం మంచిది కాదని చెప్పుకొచ్చారు.
కర్నూలు నందు న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తానని ముఖ్యమంత్రి చెబుతున్నారు. సుగాలి ప్రీతికి న్యాయం చేయలేనప్పుడు న్యాయ రాజధాని ఎందుకని ప్రశ్నించారు. ఆడపిల్లలు బయటికి వెళితే క్షేమంగా ఇంటికి తిరిగిరావాలి. దీనికి జనసేన కట్టుబడి ఉందని తెలిపారు పవన్ కళ్యాణ్. తప్పు ఎవరు చేసినా ఎంతటివారు అయిన శిక్ష పడాల్సిందని డిమాండ్ చేశారు. సుగాలి ప్రీతి విషయంలో తప్పకుండా న్యాయం జరగాలి. లేని పక్షంలో నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. దోషులకు స్థానిక నాయకుల అండ దండలు ఉంటే వెంటనే ఈ కేసును సీబీఐకి ఇవ్వాలని డిమాండ్ చేశారు.