విశాఖ స్టీలు ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేస్తే ఊరుకోబోమని జనసేన సీనియర్ నేత కోన తాతారావు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నవరత్న హోదా కలిగిన స్టీల్ ప్లాంట్ …. ఆసియాలోనే అత్యాధునికి టెక్నాలజీ కలిగినదని తెలిపారు. విశాఖ ఉక్కు నిర్వాసితుల త్యాగాలు పోస్కోకు ఇవ్వడానికి కాదంటూ తాతారావు హితవు పలికారు. అఖిలపక్ష కార్మికులు చేపడుతున్న నిరసన కార్యక్రమాలకు జనసేన పార్టీ సంపూర్ణ మద్దతునిస్తుందని వివరించారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈనెల 8వ తేదీన గాజువాక బంద్ కు పిలుపునిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విశాఖ స్టీలు ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేసే ఆలోచనను విరమించుకోవాలన్నారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.