జనసేన ఎమ్మెల్యే రాపాక పేరుకే ఆ పార్టీనే తప్ప.. ఫక్తూ వైసీపీ నేతగా ప్రవర్తిస్తున్నారు. తనకు తెలియకుండా వైసీపీ తరపున పంచాయతీ అభ్యర్థిని ఎంపిక చేయడంపై ఆ పార్టీ నేతలపై నోరుపారేసుకున్నారు. వైసీపీ కార్యకర్త సహదేవ్‌కు ఫోన్ చేసి.. దుర్భాషలాడారు. తన ఊరికి వచ్చి వైసీపీ అభ్యర్థిని పెట్టడానికి నువ్వు ఎవరంటూ బూతులు తిట్టారు. రాపాక వైసీపీ ఇంఛార్జ్ పెదపాటి అమ్మాజీని కూడా దూషించారు. ఎమ్మెల్యే మాటలకు సంబంధించి ఆడియో టేప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.