ఆంధప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు.పవన్ , జగన్ మధ్య మాటల యుద్దం నడుస్తోంది.ఈ సమయంలో ఢిల్లీ వెళ్లి వచ్చిన పవన్ కళ్యాణ్ ఈ దేశానికి అమిత్ షా లాంటి వాళ్ళే కరెక్ట్ అనడం తో పవన్ ను టార్గెట్ చేశారు వైసీపీ నాయకులు. అమిత్ షా ను కలిసిన పవన్ కళ్యాణ్ జనసెన పార్టీని బీజేపీ లో కలుపుతానని హామీ ఇచ్చి వచ్చారని విమర్శిస్తున్నారు. జనసేన బీజేపీలో కలవడం ఖాయమని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
అమిత్ షా ను పొగుడుతూ పవన్ కల్యాణ్ తాను చేసిన వ్యాఖ్యలపై ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. నేను బీజేపీ కి ఏనాడు దూరం కాలేదన్నారు. కేవలం ప్రత్యేక హోదా విషయంలోనే విభేదించానన్నారు.దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ బీజేపీ అండతో వైసీపీ ని టార్గెట్ చేస్తున్నట్టు కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. జగన్ ను కొట్టాలంటే , బీజేపీ సహకారం తప్పనిసరని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారని విశ్లేషిస్తున్నారు.
బీజేపీ టార్గెట్ కూడా ఏపీలో అధికారంలోకి రావడం . ఏపిలో బీజేపీ రాజకీయంగా బలపడటం అంతా ఈజీ కాదు. అందుకే పవన్ కళ్యాణ్ వాడుతున్నారని మరికొందరు అంటున్నారు.
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను బట్టి చూస్తే బీజేపీ తో కలిసి ముందుకు వెళ్లాలని జనసేన నిర్ణయం తీసుకుంది. జగన్ టార్గెట్ గా బీజేపీ , జనసేన కార్యాచరణ ఉండే అవకాశం ఉంది. జనసేన పార్టీని విలీనం చేస్తారా లేదా అన్నది కాలమే సమాధానం చెప్పాలి.