కోరి తెచ్చుకున్న సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంను తప్పించారంటే… ఏవో తప్పులు జరిగినట్లే అర్థమవుతుందని అనుమానం వ్యక్తం చేశారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. జగన్‌పై వ్యక్తిగత ద్వేషాలు లేవని, గత ప్రభుత్వం చేసిన తప్పులుంటే సరిచేయాలన్నారు. ఆత్మహత్య చేసుకున్న భవన నిర్మాణ కార్మికులకు 5లక్షల రూపాయల సహయం చేయాలని డిమాండ్ చేస్తూ, వరదల వల్లే ఇసుక కొరత అనటాన్ని తప్పుబట్టారు. నిర్మాణ రంగాన్ని ఆపేస్తే… అభివృద్ది ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు.
అయితే, సీఎస్ ఆకస్మిక బదిలీపై ఐవైఆర్ కృష్ణారావు మరో అనుమానం వ్యక్తం చేశారు. దేవాలయాల్లో అన్యమతస్తులను తొలగించిన విషయంలో పట్టుదలగా ఉన్నందుకే ఈ బహుమానమా అంటూ ప్రశ్నించారు. ఇదే నిజమయితే… ఇంతకన్నా దారుణమైన అంశం మరోకటి ఉండదన్నారు.
సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం బదిలీపై వైసీపీ వర్గాల్లోనూ అసలేం జరిగింది, ఎందుకింత హడావిడి నిర్ణయం అనే చర్చ జోరందుకుంది.