మూడు పెళ్లిల్లు అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. మీరు కూడా చేసుకొండి ఎవరు వద్దన్నారు, నాకు మూడు పెళ్లిల్లు అయినందుకే మీరు, సూట్‌కేసుల విజయసాయిరెడ్డి రెండేళ్లు జైల్లో ఉన్నారా అంటూ ప్రశ్నించారు. అక్కడ సందర్భం ఎంటీ, జగన్ మాట్లాడిందేంటని… ఉప రాష్ట్రపతి పదవికి కూడా గౌరవం ఇవ్వకుండా మాట్లాడారని విమర్శించారు.
మాట్లాడాలంటే మీకన్నా ఎక్కువగా మాట్లాడతామని… మీరు జనసేనకు భయపడ్డట్లు అర్థమైందన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. మీరు ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు తెస్తానంటే కాదన్నామని… కానీ టీచర్స్‌కు ట్రైనింగ్ ఇవ్వకుండా, ఓ పైలెట్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయకుండా నిర్ణయం తీసుకుంటే ఎలా అని ప్రశ్నించారు. మీరు తిరుపతిలో సుప్రభాతాన్ని కూడా ఇంగ్లీషులో చదివించుకోండి… మీకు పద్దతీ- పాడు లేదు…అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేనాడు ప్రాంతం నుండి వచ్చిన మీరే ఇలా చేస్తే ఎలాగని, హిందిపై ఓ మాట జారి… మళ్లీ కేంద్ర ప్రభుత్వ పెద్దలు వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందంటూ పవన్ గుర్తుచేశారు.