ఆర్టీసీ కార్మికుల ఉద్యమం తీవ్ర రూపం దాల్చిందని, కార్మికుల తొలగింపుపై ఉద్యోగుల్లోనే కాదు… ప్రజల్లోనూ వ్యతిరేకత ఉందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈనెల19న ఆర్టీసీ కార్మిక సంఘాలు తలపెట్టిన తెలంగాణ బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఉద్యోగుల్లో ఉద్యోగ భద్రత లేకపోవటం మంచిది కాదని, ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం తక్షణం స్పందించి, సమస్య జఠిలం కాకుండా… పరిష్కరించాలని జనసేన అధినేత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.