చౌటుప్పల్ లో జనశక్తి నేత ఆనంద్(బొమ్మని నరసింహ)ను హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వనాథ్ పేరుతో బొమ్మని నరసింహ మీటింగ్ నిర్వహించినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు.
సిరిసిల్ల సరిహద్దులో జనశక్తి సమావేశం నిర్వహించినట్టు వెల్లడైందని పేర్కొన్నారు. దీంతో అతన్ని అరెస్ట్ చేసినట్టు పోలీసులు చెప్తున్నారు. అతనికి విశ్వనాథ్‌తో సంబంధం లేదని జనశక్తి సెంట్రల్ కమిటీ ప్రకటన చేసింది.
కాగా.. నరసింహ అరెస్ట్‌పై కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. అతను ఎలాంటి మీటింగ్ లు నిర్వహించలేదని.. గత కొంత కాలంగా ఆనారోగ్య కారణంగా ఇంట్లోనే ఉంటున్నారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
నరసింహకు ఎలాంటి హాని తలపెట్టొద్దని మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు మాధవ రావు, ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటి సభ్యులు జీవన్ కుమార్ లు కోరారు. తక్షణమే అతన్ని కోర్టులో హాజరు పర్చాలని డిమాండ్ చేశారు.