సింగపూర్: దివికేగిన అతిలోక సుందరి శ్రీదేవి మైనపు విగ్రహాన్నిసింగపూర్‌లోని మేడం టుస్సాడ్స్ మ్యుూజియంలో ఆవిష్కరించారు. శ్రీదేవి భర్త బోనికపూర్, ఇద్దరు కూతుళ్ల సమక్షంలో ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. భారతీయ సినీ రంగానికి అందాలతార శ్రీదేవి అందించిన సేవలకుగానూ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్టు మ్యూజియం ప్రతినిధులు వివరించారు.
ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కూతురు జాన్వీ కపూర్ తన తల్లి మైనపు విగ్రహాన్ని తదేకంగా చూస్తూకాస్తంత భావోద్వేగానికి గురయ్యింది. ఈ మైనపు విగ్రహాన్ని ‘మిస్టర్ ఇండియా’లోని హవా హవాయి పాటలో బంగారు వర్ణపు దుస్తులు ధరించిన శ్రీదేవి ఫోటోని మోడల్‌గా తీసుకుని రూపొందించారు. శ్రీదేవి గత యేడాది ఫిబ్రవరి 24న దుబాయిలోని బత్ టబ్‌లో చనిపోయిన సంగతి తెలిసిందే.
గతంలో మధుబాల మైనపు విగ్రహాన్ని చనిపోయిన తర్వాత మేడమ్ టుస్సాడ్స్‌లో ఆవిష్కరించారు. తాజాగా చనిపోయిన తర్వాత శ్రీదేవి మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.