అతిలోక సుందరి ముద్దుల తనయ జాన్వీ కపూర్ ఆదివారం 25 వ పుట్టిన రోజును జరుపుకోనున్నారు. ఆమె జన్మదినానికి ఒక రోజు మిగిలి ఉండగానే శుక్రవారం రాత్రి నుంచే వేడుకలు మొదలయ్యాయి.
ముంబై ఎయిర్ పోర్టులో ఆమె బర్త్ డే వేడుకలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దీనిపై అభిమానులు ఆమెకు పెద్ద ఎత్తున బర్త్ డే విషెస్ చెబుతున్నారు.
విమానం ఎక్కెందుకు శుక్రవారం ఆమె ముంబై ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఆసయమంలో ఓ ఫోటో గ్రాఫర్ ఓ కేక్ తీసుకు వచ్చి దాన్ని కట్ చేయాలని జాన్వీ కపూర్ ను రిక్వెస్ట్ చేశాడు.
అభిమాని అభ్యర్థనను కాదనలేకపోయిన జాన్వీ ఆ కేకును కట్ చేసింది. సో స్వీట్ ఆఫ్ యూ అంటూ ఆ ఫోటో గ్రాఫర్ కు కేకును అందించింది. అంతలో రెండేండ్ల క్రితం కూడా ఆమె వారితో కేక్ కట్ చేసిన విషయాన్ని ఫోటో గ్రాఫర్ గుర్తు చేశాడు.
దానికి జాన్వీ నేను ఆ విషయాన్ని మరిచి పోను అంటూ బదులిచ్చింది. కేక్ కటింగ్ పూర్తయిన తర్వాత మాస్క్ తీసి ఫోటోలకు ఫోజు ఇచ్చింది. అనంతరం ఫోటో గ్రాఫర్లకు ఆమె ధన్యవాదాలు తెలిపింది.
దీనిపై సోషల్ మీడియా వేదికగా ఆమె అభిమానులు స్పందిస్తున్నారు. ఆమె చాలా వినయం కల నటి అని కొందరు అంటుండగా, ఎంత స్వీట్ గా మాట్లాడుతున్నారు అని మరి కొందరు అంటు కామెంట్లు చేస్తున్నారు.