దూరమైనప్పుడే…మనిషి విలువ తెలుస్తుంది. ఆలనాపాలన చూసే తల్లి లేకపోతే ఆ లోటు బిడ్డకి ఎప్పుడూ ఉంటుంది. అందులోనూ ఆడబిడ్డకి…! అతిలోక సుందరి కూతురికైనా ఆ బాధ మినహాయింపు కాదు.
ఔను శ్రీదేవి లోటు పూడ్చలేనిది. అలాంటి అందగత్తె మళ్ళీ రాదని కళ్ళల్లో ఆమె రూపాన్ని నింపుకున్న సామాన్య ప్రేక్షకుడు భావిస్తుంటే..నువ్వు కనిపిస్తావని ప్రతి చోటా వెతుకుతున్నానమ్మా అంటూ కన్నీరు మున్నీరవుతోంది జాన్వీకపూర్.
“అమ్మా… నీ కోసం ప్రతి చోట వెదుకుతూనే ఉంటాను. నేను ఏంచేసినా అది నువ్వు గర్వించేలా ఉండాలని కోరుకుంటాను. నేను ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా అది నీతోనే మొదలవుతుంది… నీతోనే ముగస్తుంది” అంటూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది.
అంతేకాదు, తల్లితో కలిసున్న ఫొటోను కూడా జాన్వీ పంచుకుంది.శ్రీదేవిని 2018లో దుబాయ్ లోని ఓ హోటల్ లో విగతజీవురాలిగా ఉన్న స్థితిలో గుర్తించారు.అప్పటికి జాన్వీ కెరీర్ ఆరంభ దశలోనే ఉంది.
శ్రీదేవి మరణం తర్వాత కుమార్తెలు జాన్వీ, ఖుషీలకు బోనీ కపూర్ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. అటు, బోనీకపూర్ మొదటి భార్య కుమారుడు అర్జున్ కపూర్ కూడా చెల్లెళ్ల పట్ల ఎంతో కేర్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.