శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ లో అడుగుపెట్టనుందా అంటే అవుననే అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రాబోతున్న సినిమా ఫైటర్. ఈ సినిమాలో జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా అనుకుంటున్నారని సమాచారం. కథ సిద్ధంగా ఉందని, విజయ్ దేవకొండ కాల్ షీట్ ఇస్తే సినిమా పట్టాలెక్కించేయటానికి రెడీ గా ఉన్నాడట పూరి. మరి జాన్వీ కపూర్ ని పూరి తెలుగులో పరిచయం చేస్తాడు అన్న మాట ఎంతవరకు వస్తామో తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.