జాన్వీ కపూర్ కొంతకాలంగా హిందీ పరిశ్రమలో తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తోంది. అలాగే టాలీవుడ్ లో కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి జాన్వీ కి. గతంలో బాహుబలిలో శివగామి పాత్రను శ్రీదేవి ఎలా మిస్సయిందో, జాన్వీ లైగర్ ను కూడా అలానే మిస్ అయింది.
అయితే ఇప్పుడు రామ్ పోతినేని, బోయపాటి శ్రీను లు వారి సినిమా కోసం జాన్వీ ని సంప్రదించారట. కానీ ఆమె అది కూడా మిస్ చేసుకుందట.
ఇదే విషయమై చాలా మంది మాట్లాడుతూ…. టాలీవుడ్‌కి సంబంధించి ఆమె రెండవ తప్పు చేసిందని అంటున్నారు. ఇక ఇటీవలే రామ్ పోతినేని బోయపాటి సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే.
నిజానికి ఆమె జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ , విజయ్ దేవరకొండ సినిమాలకోసం ఇప్పుడు వెయిట్ చేస్తుందట జాన్వీ కపూర్.