బాలీవుడ్ హీరోయిన్ జాన్వీకపూర్ మరోసారి ట్రోలింగ్ బారిన పడింది. మొన్నటి వరకు చెల్లి జోలికి వస్తే ఊరుకోను అంటూ పైర్ అయిన జాన్వీ ఇప్పుడు అభిమానుల ప్రశ్నలతో చిక్కుల్లో పడింది. జాన్వీ నటించిన లేటేస్ట్ మూవీ ‘గుడ్ లక్ జెర్రీ’. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇంటర్వ్యూలో మాథ్స్‌పై కామెంట్స్ చేసి ట్రోలింగ్‌కు గురైంది.
” స్కూల్‌లో చదివేటప్పుడు చరిత్ర, లిటరేచర్ అంటే చాలా ఇష్టం. మ్యాథ్స్ అంటే అస్సలు ఇష్టం లేదు. అయినా నాకో విషయం అర్థం కాదు. అదేంటంటే.. కాలిక్యులేటర్ కనిపెట్టిన తర్వాత లెక్కలు చేయడం చాలా సులభమైంది. ఇంకా కష్టపడి ఆల్జీబ్రాను నేర్చుకోవడంలో ఉపయోగమేంటి? గణితం కోసం ఎందుకు అంతలా తలలు బాదుకుంటారో అర్థం కాదు. అయితే చరిత్ర, సాహిత్యం ప్రజల్ని సంస్కారవంతమైన మనుషులుగా తీర్చిదిద్దుతాయి. మాథ్స్ మిమ్మల్ని నెమ్మదించేలా చేస్తుంది”. అని జాన్వీ అభిప్రాయం వ్యక్తం చేసింది.
కాగా, జాన్వీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా..ట్రోలింగ్స్ మొదలయ్యాయి. నీకు ఇష్టం లేకుంటే అదే చెప్పుకానీ.. మ్యాథ్స్ సబ్జెక్ట్తో ఏం ఉపయోగం అనడమేంటని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. మరికొందరు జాన్వీకి సపోర్ట్ గా నిలుస్తున్నారు. నిజంగానే మ్యాథ్స్ సబ్జెక్ట్ తో కెరీర్ లో ఎలాంటి ఉపయోగంలేదని.. జాన్వీ చాలా చెప్పావ్ అంటున్నారు. శ్రీదేవీ కూతురిగా ఎంతో అభిమానిస్తున్నామని.. ఇకనుంచి ఇలాంటి మాటలు మాట్లాడొద్దని మరికొంత మంది సూచిస్తున్నారు.
అయితే, గణితం విషయంలో లెక్క తప్పిన జాన్వీ.. తిక్కగా మాట్లాడుతుందంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. దీంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది జాన్వీ. కాగా, ఆమె నటించిన ‘గుడ్ లక్ జెర్రీ’ సినిమా జూలై 29న రిలీజ్ కానుంది.