బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఇటీవల తన స్నేహితులతో కలిసి ఓ రెస్టారెంట్ కు వెళ్లారు. పార్టీ పూర్తయ్యాక రెస్టారెంట్ బయట వచ్చి తన కారు కోసం ఆమె వెళుతున్నారు. అయితే ఆమెను గమనించి అభిమానులు వెంటనే ఆమె ఫోటోలను క్లిక్ చేశారు.
కారులో ఆమె ఎక్కుతుండగా కొందరు వీధి బాలలు వచ్చి ఆమెను డబ్బులు అడిగారు. ఆ పిల్లలను చూసి డ్రైవర్ డబ్బులు ఇవ్వబోతుండగా వద్దంటూ అతనికి జాన్వీ సైగ చేసింది. డబ్బులకు బదులు బిస్కెట్లు ఇవ్వాలని సూచించింది.
ఆమె తన కారులో ఎప్పుడూ ఎక్కువగా స్నాక్స్ పెట్టుకుంటారు. ఆ పిల్లలు అడగడంతో తన కారులో ఉన్న స్నాక్స్ ప్యాకెట్స్ ను వాళ్లకు జాన్వీ ఇచ్చారు. దానికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఆ వీడియోలో జాన్వీ బ్లాక్ కలర్ డ్రెస్ లో కనిపిస్తున్నారు. బాడీ కాన్ డ్రెస్ లో ఆమెను చూసిన అందరు వావ్ అంటున్నారు. ఇక పిల్లల పట్ల ఆమె వ్యవహరించిన తీరుపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అందానికి మించిన మానవతా హృదయం అంటూ కామెంట్లు చేస్తున్నారు.