అతిలోక సుందరి తనయ జాన్వీ కపూర్ ఎప్పటి కప్పుడు తన డ్రెస్సింగ్ స్టైల్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటారు. తాజాగా అమ్మడు హెండ్రిక్స్ మిడ్డీ డ్రెస్‌లో కనిపించారు. ఈ డ్రెస్‌లో ఈ అందాల భామ చాలా క్యూట్ గా కనిపించారు.
బ్లాక్ అండ్ శాండ్ జీబ్రా డ్రెస్‌లో అమ్మడు మరింత హాట్‌గా కనిపించారు. వీటికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. అమ్మడు తాజా ఫోటోలను చూసి కుర్రకారు ఫిదా అయిపోతున్నారు. ఆమె అందాన్ని వర్ణిస్తూ కుర్రకారులు కవితలు రాసేస్తున్నారు.
ఇక ఈ అందాల భామ బాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఓ వైపు నటనలో అదరగొడుతూనే మరోవైపు గ్లామర్ డోసు పెంచుతోంది. ఇక జాన్వీ లేటెస్ట్ ఫిల్మ్ గుడ్ లక్ జెర్రీ. ఇది ఇటీవల ఓటీటీలోకి డైరెక్ట్ గా విడుదలైంది. సినిమా పర్లేదు అనిపించుకుంది.
ఇక అమ్మడు దక్షిణాది భాషల్లో నటించాలని అనుకుంటున్నట్టు చెప్పింది. తల లేటెస్ట్ మూవీ మిలి ప్రమోషన్స్‌లో
భాగంగా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసింది. మిలీ మూవీ ఇటీవల విడుదలైంది. ఈ సినిమాను హెలెన్ సినిమాకు రీమేక్‌గా దర్శకుడు మతుకుట్టి క్జావియర్ ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు.