జపాన్ లోని నగోయా మేయర్ చేసిన పని విమర్శల పాలయింది. సోషల్ మీడియా దెబ్బకు ఆయన క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. సాఫ్ట్ బాల్ ప్లేయర్ మియూ గోటో ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించింది. అయితే నయోగాలో జరిగిన ఓ కార్యక్రమానికి ఆమె హాజరైంది. అదే ప్రోగ్రాంలో ఉన్న మేయర్ టకాషి కవామురా కాస్త అతి చేశాడు. వియూ బంగారు పతకాన్ని తీసుకుని మెడలో వేసుకుని గట్టిగా కొరికేశాడు. దీంతో దానిపై పంటిగాట్లు పడ్డాయి. ఆ సమయంలో ఏం చేయలేక నవ్వుతూనే ఉన్న మియూ.. తర్వాత ఒలింపిక్స్ నిర్వాహకుల్ని సంప్రదించింది.
ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ మియూ అభ్యర్థనకు స్పందించి కొత్త మెడల్ ఇచ్చేందుకు ఓకే చెప్పింది. దానికి అయ్యే ఖర్చును కూడా భరిస్తామని తెలిపింది. అయితే ప్రస్తుత కరోనా సమయంలో మేయర్ వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. అథ్లెట్ ను అవమానించారంటూ ఆయనపై ఏకంగా… 7వేల వరకు ఫిర్యాదులు అందాయి. విమర్శలపై స్పందించిన మేయర్… మియూ గోటోకి సారీ చెప్పాడు.