ప్రపంచవ్యాప్తంగా అనేక స్కూళ్లలో భిన్నరకాల యూనిఫాంలను ధరిస్తుంటారు. అయితే చాలా వరకు స్కూళ్లలో బాలికలు షార్ట్ స్కర్ట్‌లను యూనిఫాంలుగా ధరిస్తారు. జపాన్‌లో మనకు ఇలాంటి వారు ఎక్కువగా కనిపిస్తారు. అక్కడ అధిక శాతం స్కూళ్లలో విద్యార్థినిలు షార్ట్ స్కర్ట్‌లను ధరిస్తారు. అయితే ఇలా ధరించే అలవాటు ఎప్పటి నుంచి ప్రారంభమైంది ? దీన్ని అసలు ముందుగా ఎవరు ప్రారంభించారు ? అంటే.
జపాన్‌లో స్కూల్ యూనిఫాంలను సెయిఫుకు అని పిలుస్తారు. మన దగ్గర ఉన్నట్లుగానే ఒక్కో స్కూల్ వారు ఒక్కో రకం యూనిఫాంను ధరిస్తారు. కానీ విద్యార్థినిలు మాత్రం షార్ట్ స్కర్ట్‌లనే ధరిస్తారు. 1990లలో జపాన్‌కు చెందిన పాప్ స్టార్ నేమీ అమురో సూపర్ షార్ట్ స్కర్ట్‌ను ధరించింది. ఇది అప్పట్లో స్కూల్ గర్ల్స్ ను ఎంతగానో ఆకర్షించింది. దీంతో వారు తమ స్కూల్ యూనిఫాంలను కూడా అలాగే డిజైన్ చేసుకుని ధరించడం మొదలు పెట్టారు. అలా ఆ ఫ్యాషన్ ఇప్పటికీ కొనసాగుతోంది.
అయితే షార్ట్ స్కర్ట్‌లను యూనిఫాంలుగా ధరించడం వరకు ఓకే. కానీ అవి మరీ పొడవు అనుమతించిన దానికన్నా తక్కువగా ఉంటే మాత్రం.. శిక్ష విధిస్తారు. అందుకని స్కర్ట్‌లను అక్కడి గర్ల్స్ పొడవు తగ్గించి స్టిచ్ చేసుకోవడం కష్టంగా ఉంటుంది. అయితే ఈ సమస్యను అధిగమించడం కోసం వారు స్కర్ట్ బెల్ట్ లను ఉపయోగిస్తారు. దీని వల్ల స్కర్ట్‌లను కత్తిరించి మళ్లీ కుట్టుకోవాల్సిన పని ఉండదు. బెల్ట్ కిందకు స్కర్ట్‌ను కావల్సినంత మడిస్తే చాలు.. కింద కావల్సిన పొడవు వస్తుంది. ఇలా జపాన్ స్కూల్ విద్యార్థినిలు షార్ట్ స్కర్ట్‌లను ధరిస్తుంటారు.