ఐపీఎల్ 2022 సీజన్ 15లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ జాస్ బట్లర్.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ ఐపీఎల్ లో పరుగులు సాధించాడు. ఫైనల్ లో తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోయినప్పటికీ.. రాజస్తాన్ స్కోరు కార్డులో అతడిదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం.
ఫైనల్ కు ముందే 16 మ్యాచ్ ల్లో 4 సెంచరీలు, 4 అర్ధ సెంచరీలతో 863 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన విదేశీ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు డేవిడ్ వార్నర్ పేరు మీద ఉన్న ఆ రికార్డు ను తన పేరుకు మార్చుకున్నాడు. మెగా ఫైట్ లో తన స్థాయికి తగ్గట్టు ఆకట్టుకోకపోయినప్పటికీ.. టోర్నీలో ఆరెంజ్ క్యాప్ మాత్రం తన ఖాతాలో పదిలంగానే ఉంది.
2016 సీజన్ లో విరాట్ కోహ్లీ చేసిన 4 సెంచరీల రికార్డును సమంచేశాడు కానీ.. అతను చేసిన 973 పరుగుల రికార్డును మాత్రం అతని పేరుమీదనే ఉంచాడు బట్లర్. ఐపీఎల్ చరిత్రలో ఒక మ్యాచ్ లో ఒక బ్యాటర్ చేసిన అత్యధిక పరుగుల జాబితాలో విరాట్ మొదటి స్థానంలో ఉంటే.. బట్లర్ రెండవ స్థానంలో నిలిచాడు.
అయితే.. ఈ సీజన్ కోసం బట్లర్ ను రూ.10 కోట్లకు రాజస్తాన్ రాయల్స్ రీటెయిన్ చేసుకుంది. అత్యధిక ధర పలికిన ప్లేయర్స్ లో బట్లర్ మాత్రమే ధరకు తగ్గ ఆటను ప్రదర్శించాడని క్రికెట్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.