ములుగు జిల్లా కర్రెగుట్ట ఎన్ కౌంటర్ లో గాయపడ్డ జవాన్ మధును హైదరాబాద్ కు తరలించారు. ప్రత్యేక ఆర్మీ హెలికాప్టర్ లో బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక అంబులెన్స్ లో సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో తీసుకెళ్లారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గ్రేహౌండ్స్ జవాన్ మధును కలిసేందుకు పోలీసు అధికారులు మశోధ ఆస్పత్రికి చేరుకున్నారు.
మరో వైపు ఇంటలిజెన్స్, గ్రేహౌండ్స్, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు ఆస్పత్రికి చేరుకున్నారు. వీరితో పాటు ఐజీ ప్రభాకర్ రావు, ఇంటెలిజెన్స్ ఛీఫ్ అనిల్ కుమార్ జవాన్ మధు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మధు త్వరలో కోలుకునేలా చికిత్స అందించాలని డాక్టర్లను కోరారు.
కాగా.. తెలంగాణ, చత్తీస్ ఘడ్ సరిహద్దుల్లోని ములుగు జిల్లా వెంకటాపురం మండలం కర్రెగుట్ట అటవీప్రాంతంలో మావోయిస్టులకు ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు.
ఈ తెల్లవారుజామున పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో.. నలుగురు మావోయిస్టుల మృతి చెందారు. వీరిలో వెంకటాపురం, వాజేడు ఏరియా కమిటీ డీవీసీ ఎం. సుధాకర్ ఉన్నారు. మావోయిస్టుల కాల్పుల్లో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ మధుకు గాయాలయ్యాయి. ఎల్ఎంజి, ఎస్ఎల్ఆర్ ను పోలీసలు స్వాధీనం చేసుకున్నారు.