ఈ మధ్యకాలంలో జరుగుతోన్న చాలా క్రైమ్స్ లో వివాహేతర సంబంధాలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. వివాహేతర సంబంధాలు పెట్టుకుని పచ్చటి కాపురాలలో చిచ్చు పెట్టుకుంటున్నారు. పరాయి వ్యక్తి మోజులో భర్తను, సంసారాన్ని నిప్పుల కుంపటిలా చేసుకుంటున్నారు. తాజాగా ప్రియుడితో రాసలీలలు కొనసాగిస్తూ.. ఓ జవాన్ భార్య రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. ప్రియుడితో పాటు ఉన్న భార్యను ఇంట్లోనే ఉంచి బయట నుంచి తాళం వేసిన జవాన్.. అనంతరం పోలీసులను ఆశ్రయించిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్లితే.. మధుసూదన్ అనే వ్యక్తి ఆర్మీలో జవానుగా పని చేస్తున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మధుసూదన్ భార్యకు జ్ఞానేశ్వర్ అనే వ్యక్తితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ రహ్మత్ నగర్ లోని యాదగిరి నగర్ లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ప్రియుడిని భర్తగా పరిచయం చేసి కలిసి ఉంటుంది.
అయితే, అకస్మాత్తుగా ఇంటికి వచ్చిన మధుసూదన్ ఏకాంతంగా ఉన్న భార్య, ప్రియుడు జ్ఞానేశ్వర్‌ను చూసి షాక్ అయ్యారు. వెంటనే తేరుకుని బయటి నుంచి తలుపుకు గడియ పెట్టి తాళం వేశారు. నేరుగా వెళ్లి మధుసూదన్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇంటికి వచ్చి భర్తతో తాళం తీయించారు. బయటకు రావాలని మధుసూదన్ భార్యకు, ఆమె ప్రియుడికి పోలీసులు సూచించినా చాలాసేపటి వరకు బయటకు రాలేదు. అనంతరం బయటకు వచ్చారు.
ప్రేమించి పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలు కలిగాక మరో పురుషుడితో వివాహేతర సంబంధం పెట్టుకోవడం ఏంటని మధుసూదన్ తీవ్రంగా మదనపడుతున్నారు. ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకుంటే.. నమ్మించి మోసం చేసిందని బాధపడుతున్నారు. ఈ విషయం గురించి ఇదివరకే తెలిసి ఒకసారి సూసైడ్ ప్రయత్నం చేసినట్లు ఆయన వాపోయారు. ఈ వివాహేత బంధం గురించి నిలదీస్తే.. దమ్ముంటే రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవాలని సవాల్ విసిరినట్లు తెలిపారు. మధుసూదన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.