ప్రముఖ బ్యాంకర్, బిలియనీర్ ఉదయ్ కోటక్ కుమారుడు జయ్ కోటక్ తన అమెరికా పర్యటన గురించి చేసిన ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
కొటక్ మహీంద్ర బ్యాంక్ 811 ఇనిషియేటివ్ కు ఆయన హెడ్ గా ఉన్నారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఆయన వెళ్లారు.
ఆ సమయంలో బోస్టన్ విమానాశ్రయంలో భారీగా క్యూలు కనిపించాయి. అదే సమయంలో విమాన రాకపోకలు ఆలస్యంగా జరిగాయి. దీంతో ఆయన విసుగు చెందాడు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశాడు.
‘ ఇక్కడి నగరాలు మురికిగా ఉన్నాయి. ప్రతిరోజూ తుపాకీ హింస వార్తల్లో కనిపిస్తోంది. విమానాల ఆలస్యం గంటల తరబడి కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో భారత్ కు వెళితే మంచి ప్రదేశానికి తిరిగి వచ్చినట్టు అనిపిస్తుంది’ అని ట్వీట్ చేశారు.
‘ముంబై విమానాశ్రయం బోస్టన్ కంటే ఎక్కువ మంది ప్రయాణీకులను తమ గమ్యస్థానాలకు చేరుస్తోంది. ముంబైలో చాలా తక్కువ లైన్లు ఉంటాయి. అన్ని కౌంటర్లలోనూ సిబ్బంది కనిపిస్తారు’ అన్నారు.
‘బోస్టన్ తో పోలిస్తే ముంబై విమానాశ్రయం నూతనంగా, పరిశుభ్రంగా ఉంటుంది. ముంబైలో చౌకగా విమాన ప్రయాణం చేయవచ్చు. భారత్ బాగా అభివృద్ధి చెందుతోంది’ అని అన్నారు.