రేప్ కేసు నిందితులను కొట్టి చంపాలి : మహిళా ఎంపీలు - Tolivelugu

రేప్ కేసు నిందితులను కొట్టి చంపాలి : మహిళా ఎంపీలు

Jaya Bachchan Raise Voice On

మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలపై రాజ్యసభలో మహిళా ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో మహిళలకు భద్రత లేదన్నారు. మహిళల భద్రతపై సభలో చర్చ జరగాలని ఎంపీలు పట్టుబట్టారు. హైదరాబాద్‌ లో 28 ఏళ్ల యువతిని దారుణంగా రేప్ చేసిన హత్య చేయడాన్ని మహిళా ఎంపీలు తీవ్రంగా ఖండించారు. ఏఐఏడీఎంకే సభ్యురాలు విజిల సత్యనాథ్ మహిళ భద్రతపై మాట్లాడుతూ దు:ఖాన్నిఆపుకోలేకపోయారు. డిసెంబర్ 31 లోగా హైదరాబాద్ రేప్ కేసు నిందితులను ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు. ఎస్పీ సభ్యురాలు జయాబచ్చన్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదన్నారు. అయిన కాడికి చాలు…ప్రజలు సమాధానం కోరుకుంటున్నారు…ప్రభుత్వం వారికి సమాధానాలు చెప్పాలని అన్నారు. . నిందితులను బహిరంగంగా కొట్టి చంపాలన్నారు. రాజస్థాన్ లో ఆరేళ్ల బాలికపై అత్యాచారం ,గొంతు నులిమి హత్య, కేరళలో 40 ఏళ్ల మహిళపై అత్యాచారం, ఢిల్లీలో 55 ఏళ్ల మహిళపై అత్యాచారం, హత్య…. తెలంగాణ లోని వరంగల్ లో టీనేజ్ యువతిపై అత్యాచారం హత్య… రాంచీలో విద్యార్ధిపై అత్యాచారం హత్య… హైదరాబాద్ లో 28 ఏళ్ల మహిళపై అత్యాచారం హత్య… కోయంబత్తూరులో అమ్మాయిపై అత్యాచారం, హత్య జరిగాయని మహిళా ఎంపీలు రాజ్య సభ ఛైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు.

Share on facebook
Share on twitter
Share on whatsapp