చెన్నయ్ : జయలలిత జీవితమే ఒక సంచలన కదంబం. జయ బయోపిక్స్‌గా అరడజను మూవీలు రెడీ…! వాటిలో కీలకమైన రెండు చిత్రాల్లో ఒకటి కంగనా రౌనత్ జయగా ఏ ఎల్ విజయ్ రూపొందిస్తున్న తలైవి. రెండోది గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రమ్యకృష్ణ జయపాత్రలో జీవిస్తున్న క్వీన్…!
క్వీన్ ఫస్ట్ లుక్ చూస్తే… ఆదినిజంగా సెన్షేషన్ మూవీ అనేట్టుగా ఉంది. సకల జన సమ్మోహిని జయలలిత ప్రజా సభలో ప్రసంగిస్తున్న సీన్…! జనం ఫోకస్‌గా జయ పాత్రధారి రమ్యకృష్ణ మొహం కనిపించకుండా వెనుక వైపు నుంచి తీసిన స్టిల్ అదిరింది.
మూవీ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతోంది. బిగ్ స్క్రీన్‌పై సావిత్రి, ఎన్టీఆర్ మూవీలు కొంత వివాదాస్పదం అయ్యాయి. అంతగా వారి అభిమానుల్ని ఆకట్టుకోలేకపోయాయి. ఇక జయ బయోపిక్ క్వీన్ గ్రేట్ ట్రెండ్ సెట్టర్ అవుతుందని టాక్..!
జయలలిత జీవితం ఒక స్ఫూర్తి దాయకం. ఆత్మబలానికి సంకేతం. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నా ఏ మాత్రం బెదరని…అదరని నైజం ఆమె సొంతం. సినీ జీవితంలో రారాణి. రాజకీయ జీవితంలో ఉక్కు యువరాణి. ప్రత్యర్థుల ఎత్తులకు, జిత్తులకు, కేసులకు దడవని ధైర్యం ఆమెది. జైలు జీవితంలోనూ కుంగిపోని మానసిక స్థయిర్యం ఆమెది.
ప్రేమ…పెళ్లి మనసుకు మాత్రమే పరిమితం. బ్రహ్మచారిణిగా జీవన యానం. అడుగడుగునా వివాదాస్పదం.. అంతిమ క్షణాలు అనుమానాస్పదం…! టోటల్‌గా జయ లైఫ్ నేటి మహిళలకు అంతులేని ఆత్మవిశ్వాసం అనడంలో సందేహం ఏముంది ?