మాములుగా రాజకీయ నేపధ్యం ఉన్న సినిమా అయితే చేయడానికి దర్శకులు ఒకటికి పది సార్లు ఆలోచిస్తూ ఉంటారు. ఎక్కడ ఏ ఇబ్బంది వస్తుందో అనే భయం వారిలో ఉంటుంది. ముఖ్యంగా మన సౌత్ లో ఈ భయం ఎక్కువ. రాజకీయ నాయకుల మీద డైలాగులు పెట్టి ఇబ్బంది పడిన సినిమాలు ఎన్నో ఉన్నాయి అనే సంగతి తెలిసిందే. ముఖ్యంగా తమిళనాడు లో అయితే జయలలితకు భయపడేవారు.
ఆమె అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా సరే ఆమె అంటే భయం ఎక్కువగా ఉండేది. అయితే కొన్ని సినిమాలకు ఆమె అండగా నిలబడ్డారు. శంకర్ రెండో సినిమా మన తెలుగులో ప్రేమికుడు పేరుతో విడుదల అయింది. కాదలన్ అనే టైటిల్ తో తమిళంలో వచ్చింది. ఈ సినిమా స్టోరీ కాస్త భిన్నంగా ఉంటుంది. గవర్నర్ కూతుర్ని ఒక మాములూ వ్యక్తి ప్రేమించి ప్రేమ గెలవడం ఈ సినిమాలో ఉంటుంది.
జయలలిత సిఎం గా ఉన్న సమయంలో వచ్చింది ఈ సినిమా. ఈ సినిమాలో గవర్నర్ గా ఉండి కుట్రలు, కుతంత్రాలతో ఆ ప్రేమను ఆపే ప్రయత్నం గవర్నర్ చేయడం పట్ల సినిమా యూనిట్ భయపడింది. ఎలా షూట్ చేయాలి అనేది కంగారు పడింది. ఇక గవర్నర్ ఆఫీస్ నుంచి సినిమా నిర్మాతకు బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి. ఆ సీన్స్ వద్దు అని చెప్పారు కూడా… అయితే నిర్మాత జయలలితకు అసలు విషయం చెప్పడంతో సినిమాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే సెన్సార్ వాళ్ళు కట్ చేసేస్తారు. కాని మీరు భయపడాల్సిన అవసరం లేదు అని ధైర్యం చెప్పారట.