జయలలిత బయోపిక్ లకు వ్యతిరేకంగా జయలలిత మేనకోడలు దీప జయకుమార్ మద్రాసు హైకోర్టు ను ఆశ్రయించింది. జయలలిత బయోపిక్ లు విడుదలకు వీలులేదంటూ ఫిర్యాదు చేశారు.
జయలిత మృతి తరువాత ఆమె బయోపిక్ తియ్యటానికిఎంతో మంది దర్శకులు ఆశక్తి చూపారు. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ని పెట్టి తలైవి అనే సినిమాని తీస్తున్నారు. ఈ సినిమాలు కె ఎల్ విజయదర్శకత్వం వహిస్తుండగా, విష్ణు వర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
మరో వైపు నూతన దర్శకుడు ప్రియదర్శి నిత్యమీనన్ ను పెట్టి ది ఐరన్ లేడీ అనే టైటిల్ పేరుతో సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ఎంజీఆర్, కరుణానిధి, శశికళ పత్రాలు కూడా ఉన్నాయని దర్శకుడు మీడియాతో చెప్పుకొచ్చాడు.
ఇప్పుడు తాజాగా జయలలిత బయోపిక్ లు విడుదలకు వీలులేదంటూ మేనకోడలు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించటంతో చర్చనీయాంశంగా మారింది.