అప్పట్లో కొందరు హీరో హీరోయిన్లకు ఉండే డిమాండ్ గురించి అందరికి తెలిసిందే. అగ్ర హీరోల నుంచి చిన్న హీరోల వరకు మంచి డిమాండ్ ఉండేది. చేసే వాళ్ళు తక్కువ కాబట్టి ఉన్న వారిని తీసుకుని సినిమాలు చేసేవారు. ఇక రెమ్యునరేషన్ కూడా అడిగిన విధంగా ఇచ్చే వారు అప్పట్లో. అగ్ర హీరోయిన్లు కాస్త ఎక్కువగా డిమాండ్ చేసేవారు. సీనియర్ హీరోయిన్లు అయితే ఏ మాత్రం తగ్గేవారు కాదు.
జయలలిత లాంటి వారు అయితే మాత్రం తగ్గే ప్రసక్తే లేదు అనేవారు. సినిమాలు అయినా వదులుకునేవారు. అలాంటి వారిలో జయలలిత ముందు వరుసలో ఉండేవారు. అప్పట్లో జయలలితకు మంచి డిమాండ్ ఉండేది. అగ్ర నిర్మాతలు అడిగినా సరే ఆమె తగ్గేవారు కాదు. ఇలా ఒక సినిమా విషయంలో పెద్ద గొడవే అయింది. ఏంటి ఆ కథ అనేది ఒకసారి చూద్దాం. చిక్కడు దొరకడు అనే సినిమాకు అప్పుడు విఠాలాచార్య దర్శకత్వం వహించారు.
ఆయన సినిమా అంటే నిర్మాత ఊపిరి పీల్చుకునేవారు. అగ్ర దర్శకుడు అయినా సరే భారీ బడ్జెట్ లో వెళ్ళేవారు కాదు. ఇలా అప్పుడు విఠాలాచార్య ఈ సినిమా కథ రాసుకున్నప్పుడు జయలలితను హీరోయిన్ గా ఎన్టీఆర్ ను హీరోగా అనుకున్నారు. అప్పుడు జయలలిత పది లక్షలు తీసుకునేవారు. ఆయన 5 లక్షలు అని చెప్తే ఆమె నో అన్నారు. తగ్గేదే లేదు అనడంతో దర్శకుడు మరో హీరోయిన్ కోసం వెతికారు. అప్పుడు ఎన్టీఆర్ జోక్యం చేసుకుని ఆమెకు 6 లక్షలు ఇచ్చారు. కాని ఆయన మాత్రం 5 లక్షలే తీసుకున్నారు.