సినిమా పరిశ్రమలో జరిగే వివాహాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంది హీరోయిన్లు కెరీర్ ను సరిగానే ప్లాన్ చేసుకుంటారు గాని పర్సనల్ లైఫ్ ను ప్లాన్ చేసుకున్న సందర్భాలు ఉండవు అనే మాట వాస్తవం. అప్పట్లో సావిత్రి, శ్రీదేవి విషయంలో ఇదే విమర్శలు వచ్చాయి. మంచి స్టార్ ఇమేజ్ ఉన్న ఈ ఇద్దరు హీరోయిన్లు పెళ్లి జరిగి పిల్లలు ఉన్న వాళ్ళను పెళ్లి చేసుకున్నారు.
సావిత్రి పెళ్లి తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శ్రీదేవి కూడా పెళ్లి తర్వాత సమస్యలు ఎదుర్కొన్నా సరే నిలబడ్డారు. ఇక నేటి తరం హీరోయిన్లు కూడా అదే విధంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ జాబితాలోకే వస్తారు నటి జయంతి. ఒకప్పుడు ఆమెకు మంచి స్టార్ ఇమేజ్ ఉండేది. పేకేటి శివరాం అనే వ్యక్తిని ఆమె పెళ్లి చేసుకుంది. ఆయనకు అది రెండో వివాహం కావడమే కాదు అయిదుగురు పిల్లలు కూడా ఉన్నారు.
వీరి పెళ్లి ఘనంగా జరగడం అప్పట్లో హాట్ టాపిక్. ఈ పెళ్ళికి పలువురు అగ్ర నటులు హాజరు అయ్యారు. ముందు ఇద్దరూ బాగానే కలిసి ఉన్నారు గాని తర్వాత విడిపోయారు. విడిపోయిన కొన్ని రోజులకు ఆమె మరో పెళ్లి చేసుకున్నారు. నిర్మాత గిరిబాబుని రెండో వివాహం చేసుకోగా ఆయనకు కూడా అది రెండో పెళ్ళే. ఆయనకు కూడా ఆమె మళ్ళీ విడాకులు ఇచ్చారు.