అనంతపురం జిల్లా రాజకీయాల్లో కనుసన్నల్లో నడిపే సీనియర్ రాజకీయనాయకుడు జేసీ దివాకర్ రెడ్డి పని ఇక ముగిసినట్టేనా అంటే అవుననే అంటున్నాయి రాజకీయవర్గాలు. టీడీపీ అధికారం నుంచి దిగిపోయాక జేసీపై వైసీపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. జేసీ బ్రదర్స్ కు ఆర్థికంగా మూల బిందువైన జేసీ ట్రావెల్స్ ను వైసీపీ ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుందని, జేసీని దెబ్బకొట్టాలంటే జగన్ కు ఉన్న మొదటి మార్గం ఇదేనంటున్నారు జేసీ సన్నిహితులు.
2004 నుంచి 2014 వరకు అనంతపురం రాజకీయాలను తన చెప్పుచేతల్లో పెట్టుకున్న జేసీ తరువాత టీడీపీ లోకి చేరారు. మొదట పరిటాల రవి బ్రతికున్న సమయంలో టీడీపీ అధికారంలోకి వస్తే పరిటాల కుటుంబం, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జేసీ కుటుంబం అనంత రాజకీయాలను నడిపేవారు. పరిటాల మృతి తరువాత మొత్తం తారుమారైంది. టీడీపీ 2014 అధికారంలోకి వచ్చిన తరువాత కూడా జేసీ అన్ని విధాలుగా బాగానే ఉన్నాడు. తరువాత అనూహ్యంగా 2109 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చాక జేసీ కి బ్యాడ్ టైం స్టార్ట్ అయిందనే చెప్పాలి.
జేసీ బ్రదర్స్ కి సంబందించిన ట్రావెల్ బస్సు లు ఎక్కడ కనిపించిన అధికారులు సీజ్ చెయ్యటం మొదలు పెట్టారు. ఇక దీనితో విసుగు చెందిన జేసీ పూర్తిగా ట్రావెల్స్ మూసేయాలని కూడా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఒకవైపు అధికారం పోవటంతో జేసీ అనుచరులు కూడా వైసీపీ లోకి ఒక్కొక్కరుగా జంప్ అవుతున్నారు. మరో వైపు జేసీ వయసు మీద పడటంతో ఇక జేసీ పని అయిపోయిందంటూ రాజకీయవర్గాల్లో గుసగుస వినిపిస్తున్నాయి.