జగన్ పరిపాలన హద్దుమీరుతుందన్నారు మాజీ ఎంపీ టీడీపీ సీనియర్ నేత జేసీ. ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో కొంతమందిని టార్గెట్ చేసుకుని కేసులు పెడుతున్నాడంటూ ఆరోపించారు. పార్టీలో చేరితే మీ మీద ఎలాంటి కేసులు ఉండవంటూ వైసీపీ నాయకులు బయపెడుతున్నారని జేసీ తెలిపారు. రాష్ట్రంలో ఒక్క దివాకర్ ట్రావెల్స్ పైనే దాడులు జరుగుతున్నాయి. దివాకర్ ట్రావెల్స్ మాత్రమే నిబంధనలను అతిక్రమిస్తున్నాయా, మిగిలిన అన్ని ట్రావెల్స్ మంచిగా నడుస్తున్నాయా అంటూ నిలదీశారు జేసీ. వైసీపీ ప్రభుత్వం చెప్పినట్టు అధికారులు కూడా వినాల్సి వస్తుంది. లేకుంటే సీఎస్ ని బదిలీ చేసినట్టు వాళ్ళని కూడా ఎక్కడ చేస్తారో అని భయపడుతున్నారు. ట్రిబ్యునల్ బస్సులను వదిలిపెట్టమని చెప్పినా ఆర్టీవో అధికారులు విడిచిపెట్టడం లేదని జేసీ వాపోయారు.
జగన్ మావాడే అంటూ జేసీ చెప్పుకుంటున్న జగన్ మాత్రం జేసీ బ్రదర్స్ పై గట్టిగానే టార్గెట్ పెట్టాడని రాజకీయ వర్గాల్లో గుసగుస లాడుకుంటున్నారు.