తాడిపత్రిలో ఇటీవల జరిగిన ఎమ్మెల్యే పెద్దారెడ్డి-మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయుల మధ్య జరిగిన ఘర్షణల వేడి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై కేసులు పెట్టారని… కానీ నేను పెట్టాలనుకోవటం లేదన్నారు. తాను ఫిర్యాదు చేస్తే 9 మంది కానిస్టేబుల్స్, సీఐ ఇబ్బంది పడతారని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు.
పోలీసులు మీరు గౌరవం కాపాడుకోవాలని… ఇటీవలే జైలు నుండి వచ్చానని, నాకు జైలు అంటే భయం లేదన్నారు. తనను వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చంపాలని చూస్తున్నారని, తనకు ఉన్న గన్ లైసెన్స్ కూడా పునరుద్దరించకుండా ఒత్తిడి తెస్తున్నారని జేసీ ఆరోపించారు.
మాట్లాడాలని ఇంటికొచ్చామంటున్న వారు వేట కొడవళ్లు ఎందుకు తెచ్చారని, పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదని జేసీ మండిపడ్డారు.