అసోం సీఎంపై కేసు నమోదు చేయాలని ఎస్పీ కార్యాలయాల ముట్టడికి కాంగ్రెస్ పిలుపు నేపథ్యంలో.. జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలను ముందస్తు అరెస్ట్ చేసి ఆయా పోలీస్ స్టేషన్ లకు తరలించారు. అక్రమ అరెస్ట్ లపై జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ మార్చాలనుకుంటున్న రాజ్యాంగానికి అక్రమ అరెస్టులే ప్రతీక అని జీవన్ రెడ్డి అన్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రతి భారత పౌరుడికి తన అభిప్రాయం వ్యక్తం చేసే హక్కు ఉందన్నారు జీవన్ రెడ్డి. అభిప్రాయం చట్టబద్ధతకు లోబడి ఉండాలన్నారు. అసోం ముఖ్యమంత్రి బిశ్వశర్మ ముఖ్యమంత్రి హోదాలో ఉండి బాధ్యతారహితంగా దేశంలో అశాంతి నెలకొల్పే విధంగా మాట్లాడటం సరికాదన్నారు.
భారత రత్న రాజీవ్ గాంధీని అవమానించే విధంగా, దేశ మహిళలను కించపరిచే విధంగా రాహుల్ గాంధీ పుట్టుకపై కామెంట్స్ చేయడం దారుణం అని చర్య అన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్ని ఫిర్యాదులు చేసినా కేసు నమోదు చేయకుండా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్ర పోలీసులు నిర్లక్ష్యాగ నికి నిరసనగా ఎస్పీ కార్యాలయాలలో నిరసన వ్యక్తం చేయడానికి భవించాం కానీ.. మమ్మల్ని ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం కేసీఆర్ మార్కెట్ ప్రజాస్వామ్యంగా భావిస్తున్నామన్నారు జీవన్ రెడ్డి. ప్రధాన మంత్రి మోడీ అసోం ముఖ్యమంత్రి ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు జీవన్ రెడ్డి.