జీవన్ రెడ్డి, కాంగ్రెస్ నేత
భారతదేశ ఐక్యత కోసం ప్రాణాలు ఆర్పించిన చరిత్ర కాంగ్రెస్ ది. మాది త్యాగాల పార్టీ. మోడీ చరిత్ర తెలుసుకుని మాట్లాడాలి. వాస్తవాలు కనుమరుగు చేసేలా కుట్రలు చేస్తున్నారు.
కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హత మోడీకి లేదు. కాంగ్రెస్ వల్లే తెలంగాణ కల సాకారమైంది. మోడీ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. ఈ విషయంలో కేసీఆర్ ఎందుకు నోరు మెదపడం లేదు.
తెలంగాణకు తల్లిలా సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఇచ్చారు. స్వాతంత్య్రం కోసం ప్రాణాలు ఆర్పించిన వాళ్లలో బీజేపీ వాళ్లు ఎవరైనా వున్నారా? కాంగ్రెస్ ను దోషిగా చూపించాలని మోడీ చూస్తున్నారు.
ఎనిమిదేళ్లలో విభజన హామీలు అమలు చేయలేదు. ఇప్పుడు అబద్ధాలు మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి కేసీఆర్, నరేంద్ర మోడీనే కారణం.