ప్రకాష్ రాజ్ మా సభ్యులను విందుకు పిలవడం పై బండ్ల గణేష్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే బండ్ల గణేష్ వ్యాఖ్యలపై జీవితా రాజశేఖర్ స్పందించారు. బండ్ల గణేష్ కు ఆన్సర్ ఇవ్వడం కూడా వేస్ట్ అని… ప్రకాష్ రాజు చాలా సార్లు తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారని, ఆయన విజన్ నచ్చడంతో ఆయనతో కలిసి పని చేయాలని అనుకున్నానని తెలిపారు. ప్రకాష్ రాజ్ కు ఒక్క తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా మంచి పరిచయాలు ఉన్నాయని,పెద్దలతో పని చేసిన అనుభవం కూడా ఉందని అన్నారు.
కరోనా నిబంధనలతో అన్ని రకాల కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు జీవిత. ఇదివరకుతో పోలిస్తే ప్రజల్లో బాగా అవగాహన వచ్చిందని.. కరోనా రూల్స్ పాటిస్తూనే మీటింగ్ జరిగిందని.. బండ్ల కామెంట్స్ కు జీవిత కౌంటర్ ఇచ్చారు. అలాగే మా సభ్యుల్లో ఎవరి సలహా ఏంటి…రేపు గెలిస్తే ఏంచేస్తారు..అనే ఎజెండా మీదనే ఈరోజు మీటింగ్ జరిగిందన్నారు ప్రకాష్ రాజ్.