కో యాక్టర్స్ గా సినీ జీవితాన్ని ప్రారంభించిన జీవితా, రాజశేఖర్ లు నిజ జీవితంలో కూడా ఒక్కటయ్యారు. ఆ తర్వాత జీవితా డైరెక్టర్ గా మారి…. రాజశేఖర్ హీరోగా మూడు సినిమాలు తీశారు. శేషు, ఎవడైతే నాకేంటి, సత్యమేవ జయతే సినిమాలు వచ్చాయి. తాజాగా సినీ ఇండస్ట్రీ నుండి అందుతున్న సమాచారం ప్రకారం వీరి కాంబినేషన్ లో మరో మూవీ రానుంది.
మలయాళం బ్లాక్ బాస్టర్ మూవీ జోసెఫ్ ను తెలుగులో రీమేక్ చేయనున్నారు. కథ కూడా రెడీ అయ్యింది. కానీ చివరి నిమిషంలో డైరెక్టర్ నీలకంఠ మూవీ నుండి తప్పుకున్నారు. దింతో ఆ బాధ్యత కూడా జీవితా తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో మూవీ సెట్స్ పైకి రానుండగా…. త్వరలో అధికారిక ప్రకటన విడుదల కానుంది.