కరోనా థర్డ్ వేవ్ కారణంగా చాలా సినిమాలు రిలీజ్ డేట్ లను పోస్ట్ పోనే చేసుకుంటూ వచ్చాయి. ఇప్పుడు కాస్త ఉపశమనం దొరకటం తో వరుస సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
అందులో యష్ నటించిన కెజిఎఫ్ చాప్టర్ 2, షాహిద్ కపూర్ జెర్సీ కూడా ఉన్నాయి. ఈ రెండు సినిమాలు ఏప్రిల్ 14 రిలీజ్ కాబోతున్నాయి.
కెజిఎఫ్ మొదటి నుంచి కూడా అదే డేట్ కు ఫిక్స్ అయ్యి ఉంది. మొదటి పార్టు మంచి విజయం సాధించటంతో సెకండ్ పార్టు పై అంచనాలు ఎక్కువయ్యాయి.
ఇక గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన జెర్సీ సినిమా కోసం కూడా చాలా మంది ఎదురుచూస్తున్నారు. నిజానికి ఇది తెలుగు లో నటించిన జెర్సీ సినిమాకు రీమేక్. ఈ సినిమా 2019 తెలుగులో రిలీజ్ అయింది. మరి ఈ రెండు సినిమాలు వేరు వేరు జోనర్స్ అయినప్పటికీ ఏ చిత్రం విజయం సాధిస్తుందో చూడాలి.