తన అందచందాలతో యూత్ మదిని కొల్లగొడుతున్న బ్యూటీ జాన్వీ కపూర్. అలనాటి తార శ్రీ దేవి కూతురైన జాన్వీ తెలుగులో ఇప్పుడు నటించనుందా అంటే అవుననే వినిపిస్తుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయదేవరకొండ హీరోగా వస్తున్న ఫైటర్ సినిమాలో జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా అనుకుంటున్నారట. ఇక ఈ అమ్మడు సినిమాల్లోనే కాదు, ఫోటో షూట్ లతో యూత్ ని రెచ్చగొడుతూ ఉంటుంది. తాజాగా జాన్వీ ఓ ఫోటోషూట్ లో పాల్గొని ఆ ఫోటోలను సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది.