ఇటీవల కాలంలో అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హంగామా మాములుగా లేదు. వరుస సినిమాలు, ఫొటో షూట్స్‌తో నానా రచ్చ చేస్తుంది. ఈ అమ్మడుకి బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ ఫుల్ క్రేజ్ ఉంది. ఈ క్రమంలో ఎప్పుడెప్పుడు టాలీవుడ్‌లోకి అరంగేట్రం చేస్తోందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో జాన్వీ తెలుగు ఎంట్రీ ఫిక్స్ అయిందని, పూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిస్తోన్న సినిమాలో ఈ భామను హీరోయిన్‌గా ఎంపిక చేశారని వార్తలు వచ్చాయి. అంతే కాదు, సోషల్ మీడియాలో జాన్వీ కపూర్‌ను ట్యాగ్ చేస్తూ వెల్ కమ్ టూ టాలీవుడ్ అంటూ విషెస్ కూడా చెప్పారు.
అయితే, తాజాగా ఈ విషయమై జాన్వీ కపూర్ స్పందించింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ రౌడీ హీరోతో సినిమాపై గుట్టు విప్పింది. త్వరలోనే విజయ్ దేవరకొండతో ఒక సినిమా చేస్తున్నారట నిజమేనా.. అని అడగగా జాన్వీ మాట్లాడుతూ ‘ఊహాగానాలు నమ్మవద్దు. నేను ఇంకా ఏ తెలుగు లేదా తమిళ చిత్రానికి సైన్ చేయలేదు. నేను ఒక సంతకం చేస్తే.. నేను కానీ నా ప్రొడక్షన్ హౌస్ కానీ దానిని అఫీషియల్‌గా ప్రకటిస్తాము’ అని చెప్పుకొచ్చింది.
దీంతో విజయ్ సరసన జాన్వీ నటించటం లేదని, అవన్నీ పుకార్లు మాత్రమేనని క్లారిటీ వచ్చేసింది. జాన్వీ వెండితెరపై అడుగుపెట్టినప్పటినుంచి టాలీవుడ్ ఎంట్రీ కోసం ఎదురుచూస్తోన్న అభిమానులకు నిరాశే మిగిలింది. మరి ముందు ముందు ఈ అమ్మడు టాలీవుడ్ ఎంట్రీ ఏ స్టార్ హీరోతో ఉండనుందో చూడాలి.