జార్ఖండ్ ఎన్నికల్లో ఓటమితో నిరాశలో ఉన్న బీజేపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. స్వయంగా సీఎం ఓ ఇండిపెండెంట్ చేతిలో ఓటమి పాలయ్యారు. సీఎం రఘుబర్ దాస్ స్వతంత్ర అభ్యర్థి సరయూ రాయ్ చేతిలో 8550 ఓట్ల మెజారిటీతో ఓడిపోయారు. జంషెడ్‌పూర్ ఈస్ట్ నుండి సీఎం పోటీ చేసి ఓటమి చవి చూశారు.
2014 ఎన్నికల్లో సరయూ రాయ్ జంషెడ్‌పూర్ వెస్ట్ నుండి పోటీ చేసి గెలుపొందారు. కానీ ఈ ఎన్నికల్లో సరయూకు బీజేపీ టికెట్ నిరాకరించింది. దీంతో తనకు టికెట్ దక్కకపోవటంలో సీఎం పాత్ర ఉందని… సీఎంపై పోటీ చేసి గెలుపొందారు.
సరయూ రాయ్‌కు జార్ఖండ్ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. విభజనకు ముందు బీహర్‌ను కుదిపేసిన దాణా కుంభకోణాన్ని బయటపెట్టిందే సరయూ రాయ్. ఇదే కేసులో బీహర్ మాజీ సీఎం లాలూ సహా పలువురు నాయకులు జైలు పాలయ్యారు. మాజీ సీఎం మధు కోడా ఐరన్ కుంభకోణాన్ని కూడా ఈయనే బయటపెట్టడం విశేషం.