చైబాసా వివాదాస్పద వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఉపశమనం లభించింది. ఈ కేసులో దిగువ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఝార్ఖండ్ హై కోర్టు స్టే విధించింది.
2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా జార్ఖండ్ లోని చైబాసా నియోజక వర్గంలో ఒక బహిరంగ సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఒక హంతకుడు బీజేపీ అధ్యక్షుడు అవుతాడు కానీ కాంగ్రెస్ లో అలా జరగదు అని అన్నారు.
దీంతో రాహుల్ గాంధీపై బీజేపీ నేత ప్రతాప్ కుమార్ కేసు వేశారు. దీంతో రాహుల్ గాంధీకి చైబాసా కోర్టు వారంట్ జారీ చేసింది. దీన్ని రాహుల్ గాంధీ జార్ఖండ్ హైకోర్టులో సవాల్ చేశారు.
ఈ కేసులో చైబాసా కోర్ఠు ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది. ఈ కేసులో రాహుల్ గాంధీపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని హై కోర్టు సూచించింది. ఈ మేరకు పిటిషనర్ కు హైకోర్టు నోటీసులు పంపింది.