తక్కువ ధరలతో ప్రేక్షకులకు దగ్గరవుతున్న జియో సంస్థ ఇప్పుడు ఐపిఎల్ నేపధ్యంలో తన యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ 9 శుక్రవారం బెంగళూరులోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఐపిఎల్ ప్రారంభం అవుతుంది. అన్ని జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్ ప్లాన్‌లు ఐపిఎల్ ఎంబెడెడ్ తో వస్తాయి. జియో ప్రీపెయిడ్ ప్లన్స్ తో డిస్నీ + హాట్‌స్టార్ మెంబర్ షిప్ తో వస్తున్నాయి.
జియో రూ .401 ప్రీపెయిడ్ ప్లాన్: ఈ ప్లాన్ ప్రతిరోజూ 3 జిబీ హై-స్పీడ్ డేటా అందిస్తుంది. అపరిమిత దేశీయ కాల్స్ మరియు రోజుకు 100 ఎస్ఎంఎస్ తో వస్తుంది. రూ .401 ప్రీపెయిడ్ ప్లాన్ డిస్నీ + హాట్‌స్టార్ విఐపి ఉచిత సభ్యత్వాన్ని కూడా అందిస్తుంది. 28 రోజుల పాటు ఉంటుంది. అదనంగా 6GB డేటాను కూడా ఇస్తుంది.
జియో రూ 598 ప్రీపెయిడ్ ప్లాన్: జియో రూ .598 ప్రీపెయిడ్ ప్లాన్ అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు 2 జీబీ డైలీ డేటాను, జియో యాప్‌లకు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌తో రోజుకు 100 ఎస్‌ఎంఎస్ లు ఇస్తుంది. ఈ ప్లాన్ 56 రోజుల పాటు ఉంటుంది. డిస్నీ + హాట్‌స్టార్‌కు ఏడాది పాటు విఐ పీ ప్లాన్ ఇస్తుంది.
జియో రూ 777 ప్రీపెయిడ్ ప్లాన్: ప్రీపెయిడ్ ప్లాన్ అపరిమిత దేశీయ కాల్స్ తో పాటు రోజుకు 1.5 జిబి డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ రోజుకు 100 ఎస్ఎంఎస్ లను కూడా అందిస్తుంది. సాధారణ ప్రయోజనాలతో పాటు, ప్రీపెయిడ్ ప్లాన్ డిస్నీ + హాట్‌స్టార్ స్ట్రీమింగ్ యాప్ కి మెంబర్ షిప్ ఫ్రీ గా ఇస్తుంది. ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో ఉంటుంది.
జియో రూ .2599 ప్రీపెయిడ్ ప్లాన్: ఈ వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ అపరిమిత జియో టు జియో వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 ఎస్ఎంఎస్ తో వస్తుంది. ఇది రోజుకు 2GB డేటాను అందిస్తుంది. అదనంగా 10GB ఇస్తుంది. 399 రూపాయల విలువైన డిస్నీ + హాట్‌స్టార్ విఐపికి ఉచిత చందాతో ఈ ప్లాన్ ఉంటుంది.